బ్యాంకింగ్ కార్యకలాపాలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష

 

భారత్-పాకిస్థాన్ యుద్ద వాతావరణ నేపథ్యంలో బ్యాంకింగ్ కార్యక్రమాపాలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో ఏదైనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, అంతరాయం లేని బ్యాంకింగ్ సేవలు అందించేందుకు బ్యాంకులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.   ప్రజలు మరియు వ్యాపారాలకు అంతరాయం లేకుండా ఆర్థికసేవలు అందించేలా జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ దాడులతో పాక్  మన దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. 

మరోవైపు దేశంలోని ఆర్థిక సంస్థలను అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ, యూపీఐలకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఇది వాస్తమేనని ప్రభుత్వ సీనియర్ ఉన్నతాధికారి శుక్రవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, సమగ్రతతోపాటు భద్రత కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. దేశంలో సైబర్ దాడి జరిగే అవకాశముందని.. దీంతో ప్రధాని ఆర్థిక రంగ సంస్థలు చాలా అప్రమత్తతతో వ్యవహరించాలని ఆర్‌బీఐ ఇప్పటికే ఓ సలహా, సూచన చేసిందని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu