నైజీరియాలో మళ్ళీ భారీ కిడ్నాప్
posted on Jun 24, 2014 5:37PM

నైజీరియాలో మళ్ళీ భారీ కిడ్నాప్ జరిగింది. 60 మంది అమ్మాయిలని, 31 మంది అబ్బాయిలను ఇస్లామిక్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. ఆమధ్య.. అంటే ఏప్రిల్ 15వ తేదీన ఇస్లామిక్ ఉగ్రవాదులు రెండు వందల మంది పాఠశాల విద్యార్థినులను కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. ఈ అమ్మాయిలను ఉగ్రవాదుల చెర నుంచి విడిపించే విషయంలో నైజీరియా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఈ విషయం మీద ప్రపంచ వ్యాప్తంగా నైజీరియా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పటికీ ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా స్పందించలేదు. తాజాగా ఉగ్రవాదులు మరోసారి కిడ్నాప్‌కి పాల్పడ్డారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలపి మొత్తం 91 మందిని కిడ్నాప్ చేశారు. నైజీరియాలోని ఈశాన్య ప్రాంతంలో వుంటే పల్లెటూళ్ళ నుంచి వీరిని ఉగ్రవాదులు అపహరించారు. నలుగురు గ్రామస్థులను చంపి మరీ 91 మందిని కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని స్థానికులు నిర్ధారిస్తున్నా, భద్రతాదళాలు మాత్రం ఖండిస్తున్నాయి.