సీఎం చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్.. ఎందుకంటే?

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుయడు కోసం కొత్త  ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. గత రెండు వారాలుగా చంద్రబాబు ఈ కొత్త హెలికాప్టర్ లోనే పర్యటనలు చేస్తున్నారు.  గతంలో ఉన్న పాత హెలికాప్టర్ కు స్థానంలో ఈ కొత్త  ఎయిర్ బస్ హెచ్-160 మోడల్ హెలికాప్టర్ వినియోగిస్తున్నారు.  ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రయాణించేందుకు అణువుగా ఉండే ఈ హెలికాప్టర్ సీఎం భద్రతకే కాకుండా సమయం ఆదా అవ్వడంలో కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు.  ఇంతకీ పాత హెలికాప్టర్ ను ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే.. ఆ పాత బెల్  హెలికాప్టర్ లో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉండదు. భద్రతా పరంగా కూడా బెల్ కంటే ఇప్పుడు తీసుకువచ్చిన కొత్త హెలికాప్టర్ ఎంతో మెరుగు. 

ఇక పాత హెలికాప్టర్ లో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో గమ్యస్థానికి చేరుకునే వారు.  ఆర్థికంగా కూడా ఇది ఎక్కువ వ్యయంతో కూడుకున్న వ్యవహారం కావడంతో కొత్త హెలికాప్టర్ ను అధికారులు అందుబాటులోనికి తీసుకువచ్చారు.  ఈ కొత్త హెలికాప్టర్ లో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి నేరుగా జిల్లాల పర్యటనలకు వెళ్లడానికి వీలవుతుండటంతో ఆర్థికంగా తక్కువ ఖర్చు అవ్వడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతోందంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu