నవీన్ యాదవ్ ద లోకల్ బాయ్ ఆఫ్ జూబ్లీహిల్స్!
posted on Oct 10, 2025 2:09PM

1978 నుంచీ జూబ్లీహిల్స్ స్థానికుల లో కు అవకాశం ఇవ్వలేదన్నది తాజాగా కాంగ్రెస్ నుంచి అభ్యర్ధి న్న నవీన్ యాదవ్ చేసిన కామెంట్. ఇంతకీ ఏంటీ జూబ్లీహిల్స్ హిస్టరీ. ఈ నియోజకవర్గం గతంలో ఏ సెగ్మెంట్లో భాగంగా ఉండేది? ఆ డీటైల్స్ ఏంటి? అని చూస్తే.. ఇది 1952 లో ద్విసభ్య సభగా ఉండేది. ఇక్కడ ఎస్సీ కేటగిరిలో ఒకరు, జనరల్ కేటగిరిలో ఒకరు ఎంపికయ్యారు. వారెవరని చూస్తే బత్తులు సుమిత్రాదేవి ఎస్సీ కేటగిరి, నవాజ్ జంగ్ జనరల్ కేటగిరి. ఆ తర్వాత 1960లో ఇక్కడ ఉప ఎన్నిక జరగ్గా.. ఈ ఎన్నికలో సికింద్రాబాద్ కి చెందిన పార్సీ సంపన్నురాలు రోడా మిస్త్రీ గెలిచారు. 1962ఎన్నికలోనూ ఆమే గెలిచారు. ఆ తర్వాత ఈ సెగ్మెంట్ హిస్టరీ 2009లో మొదలైనట్టు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. అప్పటి వరకూ ఇది ఖైరతాబాద్ సెగ్మెంట్లో ఉండేది.
ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గెలిచారు. 2018, 2023లోనూ ఆయనే గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. మాగంటి సైతం ఈ ప్రాంతానికి స్థానికులేం కాదు. ఆయన హైదరాబాద్ లోని హైదర్ గూడ నివాసి. దీంతో నవీన్ యాదవ్ అన్నట్టు ఈ నియోజకవర్గానికి స్థానికులు ఎమ్మెల్యేగా అయ్యిందే లేదు. మొన్న కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన అజర్ సైతం ఇక్కడి వారు కారు. మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందన్న కోణంలో ఈ ప్రాంతం నుంచి ఆయన్ను పోటీకి దింపారు అధిష్టానం పెద్దలు.
ఇప్పుడు తొలిసారి నవీన్ యాదవ్ తానీ ప్రాంత స్థానికుడిననీ.. మీ బిడ్డను గెలిపించాలనీ కోరుతున్నారు. అర్ధశతాబ్దం నుంచీ జూబ్లీహిల్స్ లో అన్యులు రాజ్యమేలుతున్నారనీ.. మీ ఇంటి తమ్ముడు మీరు పిలిస్తే పలకడానికి యూసఫ్ గూడ చెక్ పోస్టులోని నా ఆఫీసు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయనీ.. మీకందరికీ అందుబాటులో ఉంటానని అంటున్నారాయన. అంతే కాదు పదేళ్ల పాటు జూబ్లీహిల్స్ లో అభివృద్ధి చేయలేని పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయాక మాత్రం చేస్తుందా? అన్న లాజిక్ లాగుతున్నారు. తనపై పెట్టినవన్నీ ఫాల్స్ కేసులనీ.. అవన్నీ వీగిపోతాయి కాబట్టి.. చదువుకున్న వాడ్ని.. స్థానికుడ్ని.. నాకు ఓటు వేసి గెలిపిస్తే మీ ఇంటి మనిషిగా ఉంటూ.. మీకు అన్ని పనులు చేసి పెడతానంటున్నారు నవీన్ యాదవ్.