నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీలకు బిగుస్తున్న ఉచ్చు
posted on Nov 30, 2025 11:35AM

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై పాటు మరో ఆరుగురిపై కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఢిల్లీ ఎకనమిక్ అఫెస్సెస్ వింగ్ వారితో పాటు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడాలతో పాటు యంగ్ ఇండియా సంస్థ కూడా కుట్ర, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. కుట్రపూరితంగా కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి.. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులపై హక్కు పొందారని ఈడీ ఆరోపించింది.
కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న మోతీలాల్ వోరా 2020లో మృతిచెందగా.. ఆస్కార్ ఫెర్నాండెజ్ 2021లో మృతిచెందారు. కాగా ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు నిన్న డిసెంబర్ 16కి వాయిదా వేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయిస్తామని, పదవులకు ఎంపికచేస్తామని, బిజినెస్‌కు రక్షణ కల్పిస్తామంటూ వివిధ వ్యక్తుల నుంచి పార్టీ సీనియర్ నేతల ద్వారా భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారని తెలిపింది. 2025 అక్టోబర్ 3 నాటి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ రూపొందించబడింది. ఈడీ తమ దర్యాప్తు నివేదికను ఢిల్లీ పోలీసులతో పంచుకోవడంతో ఈడీ కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
జవహర్‌లాల్ నెహ్రూ, ఇతర స్వాతంత్ర్య సమరయోధులు 1938లో స్థాపించిన నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ఏజేఎల్ ప్రచురించేది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2008లో ముద్రణను నిలిపివేసింది. ఆ సమయంలో, మాతృ సంస్థకు కాంగ్రెస్ పార్టీ రూ. 90 కోట్ల మేరకు బకాయి ఉంది.కాంగ్రెస్ పార్టీ తెలిపిన వివరాల ప్రకారం ఏజేఎల్ ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో, ఆ అప్పును ఈక్విటీ షేర్లుగా మార్చారు. పార్టీ ఈక్విటీ షేర్లను నిర్వహించలేని కారణంగా, వాటిని 2010లోయంగ్ ఇండియన్ (వైఐ)కి కేటాయించారు.