తిరుపతిలో జాతీయ మహిళా సాధికార సదస్సు
posted on Jul 24, 2025 1:58PM
.webp)
తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. సెప్టెంబర్ 14 నుంచి రెండు రోజుల పాటు తిరుపతిలోని తాజ్ హోటల్ లో జరిగే ఈ సదస్సు నిర్వహణపై ఆయన గురువారం (జులై 24) సమీక్ష నిర్వహించారు. తొలుత ఈ సదస్సును విశాఖలో నిర్వహించాలని భావించినప్పటికీ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సూచన మేరకు శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుపతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సదస్సుకు ఈ సదస్సుకు ప్రతి రాష్ట్రం నుంచి ఆరుగురు, ప్రతి అసెంబ్లీ నుంచీ ఆరుగురు చొప్పున మహిళా ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. 300 మందికి పైగా ఈ సదస్సుకు హాజరౌతారనీ.. ఈ సదస్సులో చర్చించిన అంశాల నివేదికను పార్లమెంటు, అసెంబ్లీల ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెడతారని అయ్యన్నపాత్రుడు వివరించారు.