హుదూద్‌తో భారీ విధ్వంసం.. నాసా హెచ్చరిక

 

హుదూద్ తుఫాను భారీ విధ్వంసం సృష్టించే ప్రమాదం వుందని నాసా శాస్త్రవేత్తలు భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాఖ తీరం వైపు శరవేగంగా దూసుకొస్తున్న హుదూద్ తుఫాను స్వభావానికి సంబంధించిన వివరాలను నాసా వెల్లడించింది. హుదూద్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని, తీరం దాటే సమయంలో 185 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు-మెరుపులతో హుదూద్ బీభత్సం చేయొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. జాతీయ రహదారులపై రాకపోకలను పూర్తిగా నిషేదించాలని వారు సూచించారు.