చిదంబరం బడ్జెట్ మీద లోకేష్ ట్వీట్
posted on Mar 1, 2013 3:42PM
.jpg)
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అని అందరికీ తెలుసు. కొంతమంది ఆయనను మీడియాలో చిద్దూ అని ముద్దుగా అభివర్ణిస్తారు. అయితే ఆయనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కొత్తపేరు పెట్టేశారు. చిదంబరాన్ని కాస్తా టాక్సంబరం అని మార్చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో దాని మీద ఆయన చిదంబరం పేరు మార్చి బడ్జెట్ మీద తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మొత్తానికి చిన్న బాసు రాజకీయ విమర్శలకోసం ప్రాసలు వెతుకుతున్నట్లు ఇటీవలి ట్వీట్స్ ను బట్టి తెలుస్తుంది.
బడ్జెట్ మీద ట్వీట్ చేసిన లోకేష్ ”Taxambaram has delivered only one thing in this budget, more taxes!” అని పేర్కొన్నాడు. నాలుగు రోజుల క్రితం రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలోనూ “31 INC MP’s + Railway Budget = Disappointment, but that’s become a congress trademark!” అని విమర్శించాడు.