నన్నపనేని కుమార్తె సుధకు వినుకొండ టిక్కెట్?

తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి ప్రస్తుతం ఇరకాటంలో పడ్డారు. చాలాకాలం వేచి ఉన్న తర్వాత ఆమె ఎం.ఎల్.సి. కాగలిగారు. అయితే ఇప్పుడు కూతురు, అల్లుడు రూపంలో ఆమెకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తన అభిష్టానానికి వ్యతిరేకంగా తన కుమార్తె సుధ రెడ్డి కులస్థుడైన రితీష్ రెడ్డిని వివాహమాడింది. తర్వాత ఈ దంపతులు నన్నపనేనికి మరో షాక్ ఇచ్చారు. వీరిద్దరూ నన్నపనేని అభిష్టానానికి వ్యతిరేకంగా వై.ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ వినుకొండ అసెంబ్లీ టిక్కెట్ ను సుధకు కేటాయిస్తానని వాగ్దానం చేసినట్లు తెలిసింది. దీంతో నన్నపనేనిపై మరింత వత్తిడి పెరిగింది. ఇటీవల ఆమె చంద్రబాబును స్వయంగా కలిసి తన పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. చంద్రబాబు మౌనంగా విన్నారే తప్ప ఏమీ మాట్లాడకపోవడంతో నన్నపనేని మరింత ఆందోళనకు గురైనట్లు తెలిసింది. కారణాలు ఏమైనా ఇటీవల నన్నపనేని ఏ సందర్భంలోనూ జగన్ ను విమర్శించిన దాఖలాలు కనిపించలేదు.

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu