వైసీపీ ఎమ్మెల్యేలకు సిగ్గు, లజ్జా ఉందా..
posted on Nov 20, 2021 12:03PM
చంద్రబాబు బాధపడుతుంటే చూడలేకపోయామన్నారు నందమూరి చైతన్య కృష్ణ. అసెంబ్లీలో భువనేశ్వరిపై అత్యంత నీచంగా మాట్లాడారని అన్నారు. రాజకీయాల కోసం మహిళ పట్ల ఇంత నీచంగా వ్యవహరిస్తారా అని చైతన్య ప్రశ్నించారు. వల్లభనేని వంశీ, కొడాలి నానీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడరని విమర్శించారు. వంశీ, నానీ, రాంబాబు మాటలపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాలన్నారు. వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే వాళ్ల మాటల వెనుక జగన్ ఉన్నారన్నది స్పష్టమవుతుందన్నారు చైతన్య కృష్ణ. నందమూరి కుటుంబం ఆదర్శవంతమైన కుటుంబమన్నారు చైతన్య కృష్ణ. ఎన్టీఆర్ తమను చాలా పద్దతిగా పెంచారన్నారు. రాజకీయాల కోసం తమ కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నారని నిలదీశారు.