కావాలన్న మహేష్...వద్దన్న నమ్రత
posted on Mar 15, 2013 10:24AM

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఎక్కువగా పబ్లిక్ ఫంక్షన్స్ లో కనిపించడానికి ఇష్టపడేవారు కాదు. ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ తన స్టైల్ ను మార్చినట్లుగా కనిపిస్తుంది. పైకి బిడియంగా కనిపి౦చే ప్రిన్స్... సరద సంభాషణలు సాగిస్తూ అందర్ని మురిపిస్తున్నాడు. హైదరాబాద్ కొండాపూర్ లో కొత్తగా ఏర్పాటైన ‘రెయిన్ బో చిల్డ్రన్ హాస్పటల్' ప్రారంభోత్సవానికి హాజరైన మహేష్... తమ పిల్లలకు సంబంధించి ట్రీట్ మెంట్ విషయంలో 'రెయిన్ బో' ఆసుపత్రి వాళ్లు బాగా కేర్ తీసుకున్నారని అన్నారు.
తన కొడుకు గౌతమ్, కూతురు సితార విషయంలో డాక్టర్లు చాలా శ్రద్ద చూపించారని అన్నారు. అంతటితో ఊరుకోకుండా తనకు మరో పాప కావాలని ఉందని మహేశ్ అన్నారు. పక్కనే ఉన్న నమ్రత అంతే సరదగా…"నో మోర్ ప్లీజ్, ఐ కాంట్” అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఈ ఐడియల్ కపుల్ ను చూసి అంతా మురిసిపోయారు.