ఏటీఎం చోరులు దొరికారు
posted on Nov 14, 2012 4:00PM



నల్గొండలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలో నిన్న పాతికలక్షలకుపైగా చోరీ జరిగింది. సీసీ కెమెరాల్ని పగలగొట్టాకే నిందితులు చోరీకి పాల్పడ్డారు. దొంగల్ని పట్టుకోవడం చాలా కష్టం.. మామూలుగానే మన పోలీసులు అదిగో అంటే ఆరు నెలలు..
కానీ.. ఈసారి మాత్రం అలా జరగలేదు. మెదడుకు పనికల్పించిన నల్గొండ పోలీసులు అనుమానితుల్ని పట్టుకుని ప్రశ్నించారు. ఇద్దరు మాజీ కేడీలు తడబడ్డారు. వాళ్లకి సరైన ట్రీట్ మెంట్ ఇచ్చేసరికి విషయం గటగటా కారింది..
మజీ నేరస్తులు ఇచ్చిన ఆధారాల ప్రకారం చోరశిఖామణుల్ని పట్టుకున్న నల్గొండ పోలీసులు.. వాళ్ల దగ్గర్నుంచి 10 లక్షల రూపాయల్ని రికవర్ చేశారు. మిగతావాళ్లు పట్టుబడితే మిగిలిన సొత్తు చేతికి చిక్కుతుంది. అప్పటిదాకా నేరస్తుల వివరాల్ని బైటపెట్టడం కుదరదని పోలీసులు చెబుతున్నారు.