జైల్లో జగన్ రికార్డ్
posted on Nov 15, 2012 1:18PM
.jpg)
అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న కడప ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సగటున రోజుకు ఒకరి కంటే ఎక్కువ మంది కలిశారు. మే 28 వ తేదీని ఆయన జైలుకు వెళ్లిన మరుసటి రోజు నుంచి సెప్టెంబర్ 27 వరకు జరిగిన ములాఖత్ వివరాలు పోలీసులు వెల్లడించారు. మొత్తం 42 ములాకత్‌ల ద్వారా 134 మందితో మాట్లాడిన జగన్ ఇందులోనూ రికార్డు సృష్టించారు. రెండో స్థానం గాలి జనార్దన్ రెడ్డిది. ఆయన ఏడాదికి పైగా జైల్లో ఉన్నా కూడా నాలుగు నెలల్లో జగన్ సృష్టించిన రికార్డును అధిగమించలేకపోయారు!
జగన్ బయటి వారి కంటే కుటుంబ సభ్యులనే ఎక్కువగా కలిశారు. జగన్ తల్లి విజమయ్మ 19 సార్లు కలవగా, భార్య భారతి 36 సార్లు, సోదరి షర్మిల తొమ్మిదిసార్లు జగన్‌న జైల్లో కలిశారు. జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ ఎనిమిది సార్లు కలిశారు. అయితే, ఆయన పేర్లు మార్చి కలవడంపైనే ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా ఆయన కలిశారు.