బ్రేకింగ్ న్యూస్‌.. యువ‌తి గొంతు కోసిన ఉన్మాది..

తెలుగు రాష్ట్రాల్లో ఉన్మాదుల ఆగ‌డాలు అస‌లేమాత్రం ఆగ‌డం లేదు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌తో అమ్మాయిల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. క‌ఠిన చ‌ట్టాలు, వేగంగా శిక్ష‌లు ప‌డ‌క‌పోవ‌డ‌మే ఈ బ‌రితెగింపున‌కు కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. మొన్న‌టికి మొన్న తాడేప‌ల్లిలో సీఎం జ‌గ‌న్ ఇంటి స‌మీపంలో యువ‌తిపై అత్యా*చారం జ‌రిగినా ఇప్ప‌టికీ మ‌రో నిందితుడిని ప‌ట్టుకోలేక పోయారు పోలీసులు. ఆ త‌ర్వాత గుంటూరు, విజ‌య‌న‌గ‌రం లాంటి మ‌రిన్ని దారుణ ఘ‌ట‌న‌లు ఏపీలో భ‌యాందోళ‌న‌లు రేపాయి. ఏపీతో పోటీనా అన్న‌ట్టు తెలంగాణ‌లోనూ దారుణం జ‌రిగింది. ఓ యువ‌తిపై ఘాతుకానికి ఒడిగ‌ట్టాడు ఓ దుర్మార్గుడు. 

కామారెడ్డి మున్సిపాలిటీలోని బర్కత్పుర కాలనీలో ఉండే యువతి ఇంట్లోకి ఓ దుండ‌గుడు ప్ర‌వేశించాడు. గుర్తు తెలియని ఆ వ్యక్తి.. ఆ ఇంట్లో ఉన్న యువ‌తి గొంతు కోసాడు. కుటుంబీకులు తెరుకునేలోగా ఆ ఉన్మాది అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. 

పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ‌చ్చింది ఎవ‌రు? ఎందుకు ఆమెపై దాడి చేశాడు?  తెలిసిన వాడేనా? అఘంతుకుడా? అనే వివ‌రాలు ఆరా తీస్తున్నారు పోలీసులు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu