బామ్మ వేషంలో టిడిపి ఎంపీ

 

 

 

ఎంపీ శివప్రసాద్ కొత్త అవతారమెత్తాడు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన ముసలి వితంతువు వేషం వేశాడు. విలేకరుల ముందుకొచ్చి తనదైన శైలిలో సమైక్యాంధ్రకకు మద్దతుగా తన వాణి వినిపించాడు. తన భర్త చనిపోయాడని.. ఆయన ఉన్నపుడు రాష్ట్రం బాగుండేదని.. ఆయన పోయాక రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారని విలపిస్తూ ఆ పాత్రను రక్తి కట్టించారు. గాంధీ తాత ఎక్కడ చూసినా కర్ర పట్టుకుని నిలుచుని ఉంటాడని.. ఐతే ఆయన ఆ కర్ర పట్టుకుని వచ్చి సోనియా గాంధీ నెత్తిన ఒక దెబ్బ.. కేసీఆర్ ముఖం మీద మూడు దెబ్బలు కొట్టాలని.. అప్పుడైనా వాళ్ల బుద్ధి మారుతుందని అన్నారు.



డీకే అరుణ కూతురిని నెల్లూరు వాసికిచ్చి పెళ్లి చేసిందని, గీతా రెడ్డి భర్తది కర్నూలని, సబితా ఇంద్రారెడ్డి కోడల్ని తూర్పు గోదావరి నుంచి తెచ్చుకుందని, మల్లు రవి.. కోనేరు రంగారావు కూతుర్ని చేసుకున్నాడని.. కేసీఆర్ ది విజయనగరమని.. కేటీఆర్ భార్య కాకినాడ అమ్మాయి అని చెప్పారు. ఇప్పుడు వీళ్లంతా విడిపోతారా.. సీమాంధ్రతో సంబంధాలు తెంచుకుంటారా అని ప్రశ్నించారు.