జగన్ కు రెబల్ ఎంపీ రఘురామరాజు విషెస్.. సీఎంపై నెటిజన్ల సెటైర్లు
posted on Dec 21, 2020 12:09PM
వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గత కొంతకాలంగా తన సొంత పార్టీపై, అలాగే సీఎం జగన్ పై విరుచుకు పడుతున్న సంగతి తెల్సిందే. అయన సొంత పార్టీ వైసీపీలో విపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఏ మాత్రం అవకాశం చిక్కినా జగన్, వైసీపీలను టార్గెట్ చేస్తూ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అయితే ఈరోజు సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ రఘురామరాజు బర్త్ డే విషెస్ తెలియ చేస్తూ ట్వీట్ చేశారు.

అయితే, అందులో జగన్ ను ట్యాగ్ చేశారు కానీ గారు అని మాత్రం సంబోధించలేదు. పైగా ఆ ట్వీట్ తో పాటు జత చేసిన ఫోటో పై ఇప్పుడు నెటిజన్లు రకరకాల కామెంట్ లు చేస్తున్నారు. కొందరేమో గారు పోయిందని…, మీరు చేయి వదిలించుకోవాలనుకుంటున్నా జగన్ వినటం లేదు, ప్రాదేయపడుతున్నారుగా… అని మరికొందరు, హ్యాపీ బర్త్ డే ఫేక్ సీఎం అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.