బీజేపీపై ఎమ్మెల్యే సీతక్క అదిరిపోయే సెటైర్లు..
posted on Dec 21, 2020 11:44AM
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కరోనా కల్లోల సమయంలో గిరిజన ప్రాంతాల ప్రజలను ఆదుకుంటూ సామాన్య ప్రజల మన్ననలను పొందిన సంగతి తెల్సిందే. అదే సమయంలో ఆమె ప్రజల పక్షాన ఉంటూ పలు ఆందోళనలలో కూడా పాల్గొన్నారు. తాజాగా ఆమె మండుతున్న పెట్రోల్ రేట్ల విషయమై బీజేపీ పై అదిరిపోయే సెటైర్లు వేశారు. దీనిపై ఆమె చేసిన తాజా ట్వీట్ అందర్నీ ఆలోచింపజేస్తూ, ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాదాపుగా ప్రతి రోజు పెట్రోల్ రేటు ఎంతో కొంత పెరుగుతుండడంతో సామాన్య జనం బెంబేలెత్తుతోంది.

పెట్రోల్ ధరల పెంపుపై ములుగు ఎమ్మెల్యే సీతక్క క్రికెట్ క్విజ్ ప్రశ్నలతో కలిపి ట్వీట్ చేసింది...
2021వ సంవత్సరంలో ఫస్ట్ సెంచరీ కొట్టేది ఎవరు…? అని సీతక్క ప్రశ్న సంధించింది. దీనికి సమాధానంగా 1. విరాట్ కోహ్లి 2. రోహిత్ శర్మ అని ఆమె అషన్స్ పోస్ట్ చేసింది. అయితే దీనికి తన ఆన్సర్ మాత్రం పెట్రోల్ ధరలు అంటూ సెటైర్ వేసింది. ఎమ్మెల్యే సీతక్క తాజా ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.