కన్నబిడ్డలనే చంపేసింది...
posted on Apr 4, 2015 3:24PM
.jpg)
కన్నబిడ్డలనే చంపేసి... ఇంట్లోనే డీప్ ప్రీజర్ లో కుక్కేసి ఓ కన్నతల్లి తనలో ఉన్న కర్కశత్వాన్ని బయటపెట్టింది. మిషెల్ బ్లయర్ అనే మహిళ తన బిడ్డలిద్దరు స్టోమీ అన్ బ్లయర్ (13), స్టీఫెన్ గేజ్ (9) లను క్రూరంగా హింసించి, వారిని చంపి ఫ్రీజర్ లోని ప్లాస్టిక్ షీటు కింద దాచేసింది. దీనిపై ఆమె మీద ఆరోపణలు నమోదయ్యాయి. అయితే ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని, కోర్టు విచారణను ఎదుర్కొంటుందో లేదో ముందు నిర్ధారించాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును అభ్యర్ధించారు. ఆమెకు ఉన్న నలుగురు సంతానంలో మిగిలిన ఇద్దరూ బంధువుల దగ్గర ఉంటున్నారు. వారిలో 17 ఏళ్ల కుమార్తె తన తల్లి క్రూరత్వాన్ని పోలీసులకు వివరించింది. తన చిన్న తమ్ముడిని ఎప్పుడూ హింసించేదని, కర్రలతో కొట్టడం, ఇస్త్రీపెట్టె వంటి పరికరాలతో కాల్చడం చేసేదని తెలిపింది. తన తమ్ముళ్లు ఇద్దరికీ మెడ చుట్టూ బిగించి, ప్లాస్టిక్ బ్యాగును కప్పి ఊపిరాడకుండా చేసి చంపినట్లు చెప్పింది.