పైలట్ కు హార్ట్ అటాక్... విమానం గాలిలో...

 

 

రోడ్డు పై నడుస్తున్న బస్సు డ్రైవర్ కు హార్ట్ అటాక్ వస్తే.. అప్పుడు అతని పరిస్థితి అలాగే ఆ బస్సు లో ఉన్న ప్రయాణికుల పరిస్థితి..?  ఇటువంటి పరిస్థితి కొన్ని సార్లు నిజంగానే తలెత్తగా ఆ డ్రైవర్లు తమ  ప్రాణాలకు తెగించి బస్సును కంట్రోల్ చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడి తమ ప్రాణాలు విడిచిన ఘటనలు మనం చూశాం విన్నాం. అదే పరిస్థితి ఒక  విమానం నడుపుతున్నపుడు పైలట్ కు ఎదురైతే ఊహించడానికే కష్టంగా ఉంది కదా. ఇటువంటి ఘటన ఒకటి రష్యా లో జరిగింది. మోంటెనీగ్రో  ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 90  మంది ప్రయాణికులతో ప్రయాణిస్తుండగా నాటకీయ పరిణామాల మధ్య కలుగా విమానాశ్రయం లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. కారణం ఏమిటంటే ఆ విమానం నడుపుతున్న పైలట్ హఠాత్తుగా స్పృహ  కోల్పోయాడు. దీనితో పక్కనే ఉన్న కో పైలట్   విమానాన్ని తన కంట్రోల్ లోకి తీసుకోని పరిస్థితిని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు తెలియ చేసి అత్యవసర లాండింగ్ కోసం అనుమతి తీసుకోని సమీపం లోని కలుగ విమానాశ్రయం లో  ల్యాండ్ చేసారు. ప్రధాన పైలట్ స్పృహ తప్పిన సమయం లో విమానంలోని ప్రయాణికులు మాత్రం తాము ప్రయాణిస్తున్న విమానం గాలిలో గింగిరాలు తిరగటంతో తమ ప్రాణాలు గాలిలో కలిసినట్లే అని భయానికి లోనయినట్లు తెలుస్తోంది. విమానం అత్యవసర లాండింగ్ సమయం లో కూడా అది సరిగా ల్యాండ్ కాలేదని కొందరు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే విమానం ల్యాండ్ ఐన తరువాత పైలట్ ను అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా పైలట్ స్పృహ తప్పటానికి కారణం అతనికి హర్ అటాక్ రావటమే అని వైద్యులు నిర్ధారించి వెంటనే చికిత్స అంద చేసినట్లు సమాచారం.