లండన్ లో మోహన్ బాబుకు సత్కారం

 

మోహన్బాబు అంటే మనకు గుర్తొచ్చేది ఆయన కంఠం, ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. ఎటువంటి సపోర్టు లేకుండానే తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ప్రతిభకు గుర్తుగా సత్కారం పొందనున్నారు. లండన్ తెలుగు అసోసియేషన్ (టీఏఎల్) వాళ్లు తెలుగు చిత్రపరిశ్రమకు 40 సంవత్సరాలుగా చేస్తున్న సేవలకు గుర్తింపుగా వచ్చే శనివారం మోహన్బాబును అవార్డుతో సత్కరిస్తున్నట్లు ప్రకటించింది. తమ సంస్థ తరపున అవార్డు అందిస్తూ సత్కారం చేయడం చాలా ఆనందంగా ఉందని టీఏఎల్ అధ్యక్షుడు దాసోజు రాములు తెలిపారు. తను అందుకోబోతున్న అవార్డును తన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు అంకితం చేస్తున్నానని మోహన్బాబు అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu