మోదీజీ, మీ మాట‌ల‌కు, చేత‌ల‌కు పొంత‌నే లేదు.. రాహుల్‌

బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్‌ చేసుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మోదీ మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన ఉండదనే విషయం యావద్దేశం చూసిందని అన్నారు. దోషులను విడుదల చేసే ఇలాంటి నిర్ణయాల ద్వారా ఈ దేశ మహిళలకు ప్రధాని ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారని ఆయన ప్రశ్నిం చారు. 2002లో గర్భి ణిగా ఉన్న బిల్కిస్ బానోపై అత్యాచారం జరిపి, ఆమె కుటుంబానికి చెందిన ఏడు గురిని హత్య చేసిన కేసులో దోషులుగా నిర్ధారించిన 11 మందిని గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం శిక్షా కాలం తగ్గి స్తూ విడుదల చేసింది.

దీనిపై రాహుల్ ఓ ట్వీట్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐదు నెలల గర్భిణిపై అత్యాచారం చేసి, మూ డేళ్ల ఆమె కుమార్తెను చంపిన వారిని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమయంలో విడుదల చేశారు. నారీ శక్తి గురించి అబద్ధాలు చెప్పే వ్యక్తులు ఈ చర్య ద్వారా మహిళలకు ఎలాంటి సందేశం ఇవ్వ దలచుకున్నారు. మోదీజీ...మీ మాటలకు చేతలకు పొంతన ఉండదనే విషయం యావద్దేశం చూసిం ద‌ని హిందీలో ట్వీట్ చేశారు. బిల్కిస్ బానో కేసులో దోషులు 15 ఏళ్ల జైలుశిక్ష తర్వాత సోమవారం గుజరాత్ లోని గోద్రా సబ్ జైలు నుంచి విడుదల కాగానే వారికి స్వీట్లు, పూలదండలతో స్వాగతం లభించింది.

బిల్కిస్‌ బానో కేసులో దోషులుగా తేలిన 11 మంది జీవిత ఖైదులు సోమవారం (ఆగ‌ష్టు 15)గోద్రా సబ్‌జైలు నుంచి విడుదలయ్యారు. వీరి విడుదలకు గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం రెమిషన్‌ పాలసీ కింద ఆమో దించిన నేపథ్యంలో మొత్తం 11 మంది దోషులూ జైలు నుంచి బయటకు వచ్చారు. 2002లో గోద్రా ఘటన తర్వాత చోటుచేసుకున్న బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు హత్య కేసులో 2002లో సీబీఐ ప్రత్యేక కోర్టు 11 మందికి శిక్ష విధించింది.

ముంబై హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. దోషులు ఇప్పటికే 15 ఏళ్ల‌కు పైగా జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తువిడుదల కోరుతూ ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం ఆదేశాల మేరకు గుజరాత్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ 11 మంది దోషులకు శిక్ష నుంచి ఉపశమనం