అమరావతి కేవలం నగరం కాదు.. ఒక శక్తి.. ప్రధాని మోడీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించారు. అమరావతి పున: నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అమరావతి కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదనీ అదోక శక్తి అని ఉద్ఘాటించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న 18 కీల‌క ప్రాజెక్టుల‌కు వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు.  వీటిలో అమ‌రావ‌తి రాజ‌ధానిలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో. ఏపీలో కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టే ప్రాజ‌క్టులూ ఉన్నాయి.  ఉన్నాయి.

అమ‌రావ‌తి లో 58 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టుల‌కు శ్రీకారం చుట్టారు. అలాగే ఏడు జాతీయ రహదారులకు సంబంధించిన ప్రాజెక్టులకూ శంకుస్థాపన చేశారు. ఈ జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ను ఇతర రాష్ట్రాలతో అనుసంధానం చేస్తాయి.  ఈ ప్రాజెక్టులలో జాతీయ రహదారులలోని వివిధ విభాగాల విస్తరణ, రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు సబ్ వే నిర్మాణాలు ఉన్నాయి.  రోడ్డు భద్రతను మరింత పెంచే లక్ష్యంతో వీటిని చేపడుతున్నారు. ఇది ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. అలాగే రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు సులువైన, తేలికైన, సజావైన ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి.  

 అలాగే ఎలివేటెడ్ కారిడార్, హాఫ్ క్లోవర్ లీఫ్,  రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాపన చేశారు. ఇక రాజధాని అమరావతికి సంబంధించి...  శాసనసభ, హైకోర్టు, సచివాలయం,  పరిపాలనా భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.  అనంతరం హస్తినకు బయలు దేరి వెళ్లారు. అలా వెళ్లగానే తన అమరావతి పర్యటనపై ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తాను ఒక చారిత్రక అధ్యాయాన్ని ప్రారంభించాననీ, అందుకు ఎంతో ఆనందంగా ఉందనీ పేర్కొన్నారు.అమరావతి ఏపీ ప్రగతి పథాన్ని ముందుకు తీసుకువెడుతుందనీ, ఆది ఒక మహానగరంగా అవతరిస్తుందనీ విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి పట్ల, ప్రజల పట్ల చంద్రబాబు నిబద్ధత ప్రశంసనీయమని మోడీ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అమరావతి కేవలం ఒక నగరం కాదనీ, అదోక శక్తి అని అభివర్ణించారు. అలాగే అమరావతి నిర్మాణం పట్ల, ప్రజల పట్ల చంద్రబాబు నాయుడు  నిబద్ధత ప్రశంసనీయం అంటూ ఆ ట్వీట్ లో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu