సింహం పిల్లలకు పాలు పట్టిన మోడీ.. వంతారా వైల్డ్ లైఫ్ సెంటర్ ను ప్రారంభించిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ గిర్ లోని అభయారణ్యాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన లయన్ సఫారీలో ఫొటోలు తీశారు. ప్రకృతి అందాలను ఆస్వాదించారు. అలాగే గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం (మార్చి 4) జామ్ నగర్ లో రిలయెన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  నడుస్తున్న వణ్యప్రాణి పునరావాస, సంరక్షణ కేంద్రం వంతారాను ప్రారంభించారు. అనంతరం ఆయన అక్కడ జంతువులకు అందిస్తున్న వైద్యం, సంరక్షణను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మోడీ వెంట అనంత్ అంబానీ కూడా ఉన్నారు.

సుమారు మూడు వేల ఎకరాల్లో రిలయెన్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ వణ్యప్రాణి పునరావాస, సంరక్షణ కేంద్రం  ప్రపంచంలోనే అతి పెద్దది.  ఈ కేంద్రంలో జంతువులకు సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని ఆయన మోడీకి వివరించారు. వంతారాను సందర్శించిన మోడీ అక్కడి డాక్టర్లు, ఇతర స్టాఫ్ తో  ముచ్చటించారు.   అక్కడి   వైద్య కేంద్రంలో ఓ చిరుతకు శస్త్రచికిత్స జరుగుతుండగా మోదీ ఆ శస్త్రచికిత్స జరుగుతున్న తీరును పరిశీలించారు. ఓ ఏనుగుకు ఎంఆర్ఐ స్కానింగ్ జరుగుతుంటే, అక్కడికి కూడా వెళ్లి చూశారు.   వంతారాలో జంతువులకు అందిస్తున్న సేవలను స్వయంగా చూసిన ప్రధాని మోడీ  నిర్వాహకులను అభినందించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu