20న తెలుగు రాష్ట్రాల బంద్ కు మావోయిస్టుల పిలుపు

ఆపరేషన్ కగార్ కు నిరసనగా ఈ నెల 20న రెండు తెలుగు రాష్ట్రాల బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రం  అటవీ ప్రాంతాలలో మిలటరీ ఆపరేషన్ ద్వారా హక్కులను కాలరాస్తున్నదని దుయ్యబట్టింది.

ఈ మేరకు తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిథి జగన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు పార్టీ కీలక నేతలు చలం, అడేల్ లను ప్రభుత్వం హతమార్చిందని పేర్కొన్నారు.  ఆపరేషన్ కగార్‌లో తమ నాయకుల మరణం ద్వారా తీవ్ర నష్టం జరిగిందని, దీనికి నిరసనగా జూన్ 20న బంద్‌ను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ బంద్‌ను విజయవంతం చేయడానికి ప్రజలు, సంస్థలు సహకరించాలని కోరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu