కవితపై చర్యలకు సిద్ధమవుతున్న గులాబీ పార్టీ
posted on Sep 1, 2025 6:29PM
.webp)
బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవితపై గులాబీ పార్టీ చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె పీఆర్వో నవీన్ కుమార్‌ను బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలిగించినట్లు సమాచారం. అటు బీఆర్‌ఎస్ ఫాలోవర్ల కవిత ట్వీట్టర్, ఇన్‌స్టా అకౌంట్లను అన్‌ఫాలో కొడుతున్నారు. మరోవైపు కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన షాకింగ్ కామెంట్స్‌పై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది.
కవితకు కౌంటర్ ఇస్తూ.. బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హరీష్‌రావును ఆరడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేసింది. కవిత కామెంట్స్ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌కు బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసీఆర్‌తో కేటీఆర్, మధుసూదనాచారీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వరరరెడ్డి సమావేశమైనట్లు సమాచారం.