నిరాహార దీక్షను విరమించిన కవిత..పోరాటం ఆగదని స్పష్టీకరణ

 

చట్ట సభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ  కవిత తెలిపారు. నిరాహార దీక్షకు హైకోర్టు కోర్టు అనుమతి నిరాకరించిందని కవిత వెల్లడించారు. కోర్టులను ధిక్కరించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. న్యాయస్థానాల పట్ల తనకు గౌరవం ఉందని కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ జరగకుండా వెళ్తే.. ఎన్నికలను ఎలా ఆపాలో తమకు తెలుసన్నారు. 

బీసీ బిల్లు సాధన కోసం తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన ఆర్. కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. నిరాహార దీక్ష చేసేందుకు సాయంత్రం 5 గంటల వరకే పర్మిషన్ ఉండగా.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదే సమయంలో భారీ వర్షం కురవడం, కోర్టు ఆదేశాలతో కవిత దీక్షను విరమించారు. . ఈ పోరాటం ఆగదని.. అనేక రూపాల్లో చేస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ధర్నాలతో సాధించేది ఏం లేదన్నారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu