బీఆర్‌ఎస్ కార్యాలయాల్లో కవిత పోస్టర్లు, బ్యానర్లు తొలగింపు
posted on Sep 2, 2025 3:57PM

తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్సీ కవిత ప్లెక్సీని బీఆర్‌ఎస్ శ్రేణులు దహనం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్న కవిత బ్యానర్లు తీశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కవిత దిష్టిబొమ్మ ను దహనం చేశారు. మాజీ మంత్రి హారీశ్‌రావుపై ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాట్లు వారు తెలిపారు. బీజేపీ నాయకులకు కవిత అమ్ముడుపోయారని వారు ఆరోపించారు.
తమ పార్టీ నేతలను కించపరిచే వ్యాఖ్యలను ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకే కవితను పార్టీను నుంచి సస్పెండ్ చేసినట్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కల్వకుంట్లు కుటుంబంలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్సేనని ఆయన ఆరోపించారు. పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరిపైనైనా చర్యలు తప్పవు. కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ ఉంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించినందుకే కవితపై వేటు వేశమని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. తనని సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కవిత ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఇదే అంశంపై కవిత స్వయంగా మీడియా ఎదుట వెల్లడించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కవిత.. బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.