హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి కేంద్ర హోంమంత్రి..శోభాయాత్రలో పాల్గొననున్న అమిత్ షా

హైదరాబాద్ లో ఏటా గణేష్ నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా సాగుతుంది. ఈ సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర కన్నులపండువగా ఉంటుంది. అంగరంగ వైభవంగా సాగే ఈశోభాయాత్రకు బీజేపీకి చెందిన ప్రముఖ నాయకులు హాజరౌతుంటారు.

అలాగే  ఈ సారి హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా సాగే శోభా యాత్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్మానం మేరకు ఆయన శోభాయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్నారు.  

ఈ ఏడాది సెప్టెంబర్ 6న భాగ్యనగర్ గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 6న హైదరాబాద్ వస్తున్నారు.  అదే రోజు  ఐ టి సి కాకతీయలో బిజెపి ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట మయంలో చార్మినార్ వద్ద వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు. సాయంత్రం ఎంజే మార్కెట్ వద్ద శోభాయాత్రలో పాల్గొంటారు. ఈ రోండు చోట్లా అమిత్ షా ప్రసంగిస్తారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu