వైసీపీ ఎమ్మెల్సీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

 

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో  చుక్కెదురైంది. ఆయన వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. కేసు పునర్విచారణ చేయాలని రాజమండ్రి కోర్టు తీర్పు ఇచ్చింది. దళిత యువకుడు, మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కేసులో తదుపరి విచారణను కొనసాగించవచ్చుని ఇటీవల ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. 

తమకు న్యాయం చేయాలని.. ఈ హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపి, అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరింది. ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీంతో సిట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతబాబుకు సహకరించిన వారిపై సిట్  ఫోకస్ పెట్టింది. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసే యోచనలో ఉంది. డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడుగా ఉన్నారు. 2022 మే 19న కాకినాడలో సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. 

డ్రైవర్‌ను హతమార్చిన ఎమ్మెల్సీ అనంతబాబు.. మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే.  తానే మర్డర్ చేశానని అనంతబాబు అంగీకరించారని మీడియా సమావేశంలో అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. అనంతబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి రిమాండ్‌కు పంపారు. తర్వాత మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. తమకు న్యాయం చేయాలని.. ఈ హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపి, అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu