బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు

 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై  అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్  హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. బంజారాహిల్స్, రాజేంద్రనగర్. షాద్‌నగర్ పోలీసు స్టేషన్‌లో కాంగ్రెస్ శ్రేణుల ఫిర్యాదులతో బీఎన్ఎస్ 356(2),353(B)352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

‘రేవంత్ రెడ్డి నువ్వు ఇట్లనే నోటికొచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఎవరెవరితో తిరిగావో ఆ 16 మంది పేర్లు బయట పెడతా.. నువ్వు జూబ్లీహిల్స్‌లో ఎక్కడ పడుకున్నావో, దుబాయిలో ఎక్కడ పడుకున్నావో, ఢిల్లీలో ఎక్కడ పడుకున్నావో నాకు అన్నీ తెలుసు.. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాను. నీ స్టోరీలు అన్నీ నాకు తెలుసు. మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తనవి ఆరోపణలు కాదు వాస్తవాలు కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu