సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి కూనంనేని

 

 

సీపీఐ తెలంగాణ కార్యదర్శిగా మరోసారి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. మేడ్చల్ జిల్లా గాజులరామారంలో జరిగిన 4వ రాష్ట్ర మహా సభలో ఆయన పేరును సీనియర్ నేత పల్లా వెంకట్‌రెడ్డి ప్రతిపాదించగా, మరోనేత శంకర్ బలపరిచారు. కూనంనేని వరుసగా రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక అయ్యీరు.మూడేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. 

. కొత్తగూడెం పట్టణానికి చెందిన కూనంనేని సాంబశివరావు మొదట  పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించారు. విశాలాంధ్ర పత్రికలో జర్నలిస్టుగానూ పనిచేశారు. 1984లో పట్టణ సీపీఐ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.

1987లో కొత్తగూడెం మండలపరిషత్ ఎన్నికల్లో గెలిచి మండలాధ్యక్షుడు అయ్యాడు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. 2005 లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 2009లో సిట్టింగ్ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఓడించి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu