రామ్మోహన్ నాయుడు ఇంటికి చంద్రబాబు... చిన్నారికి ఆశీస్సులు
posted on Aug 22, 2025 10:03PM
.webp)
ఏపీ చంద్రబాబు హస్తినలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నివాసంలో సందడి చేశారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి ఇంటికి ప్రత్యేకంగా వెళ్లి ఆయన కుటుంబాన్ని పలకరించారు. ఇటీవల రామ్మోహన్ నాయుడు దంపతులకు కుమారుడు జన్మించిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి వారిని కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా, రామ్మోహన్ నాయుడు కుమారుడిని చంద్రబాబు ఆప్యాయంగా ఎత్తుకుని ఆశీర్వదించారు. చిన్నారికి తన దీవెనలు అందించి, ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం, రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఆత్మీయ పలకరింపుతో రామ్మోహన్ నాయుడు నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి రాక పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.