ఇవాళ షర్మిల.. రేపు జూనియర్ ఎన్టీఆర్.. జగ్గారెడ్డి సంచలన కామెంట్స్

వై ఎస్ షర్మిల పెట్టబోతున్న కొత్త పార్టీపై తెలంగాణాలో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఆమె వెనుక ఎపి సీఎం జగన్ ఉన్నారని.. కాదు కాదు తెలంగాణ సీఎం కేసి ఆర్ అండతోనే ఆమె పార్టీ పెడుతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. ఇది ఇలాఉండగా ఇదే అంశమే పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. అమిత్‌షా వదిలిన బాణం వైఎస్ షర్మిల అని అయన వ్యాఖ్యానించారు. ఈరోజు అసెంబ్లీ మీడియా హాల్‌లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌, జగన్‌, అసదుద్దీన్‌ అందరు కూడా అమిత్‌షా బాణాలేనని అయన ఆరోపించారు. తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. "ఇవాళ షర్మిల వచ్చింది. రేపు జూనియర్‌ ఎన్టీఆర్‌, లేదంటే.. ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి మరో వ్యక్తి వచ్చి పార్టీ పెట్టవచ్చు. ఇంతోటి దానికి తెలంగాణ తెచ్చుకోవడం ఎందు కు? మళ్లీ సమైక్య రాష్ట్రం చేస్తే పోలే!’’ అని అయన వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఈ నెల 15న ఆరూరు నుంచి అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం వరకు తాను పాదయాత్ర చేస్తానన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu