కారు ప్ర‌మాదం.. ఎమ్మెల్యే కొడుకు, కోడ‌లు దుర్మ‌ర‌ణం..

బెంగళూరులో ఘోర కారు ప్రమాదం జరిగింది. ఓ కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. వెంట‌నే మంట‌లు చెల‌రేగాయి. ఘ‌ట‌న‌లో కారు నుజ్జునుజ్జు అయింది. ముందు, వెనుక సీట్ల‌లో ఉన్న‌వారంతా విఘ‌త‌జీవులుగా మారారు.

ప్ర‌మాదంలో మొత్తం ఏడుగురు చ‌నిపోయారు. ఆరుగులు స్పాట్‌లోనే చ‌నిపోగా.. మ‌రొక‌రు హాస్పిట‌ల్‌లో మృతి చెందారు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  

చ‌నిపోయిన వారిలో తమిళనాడులోని హోసూరు డీఎంకే ఎమ్మెల్యే వై. ప్రకాశ్‌ కుమారుడు కరుణసాగర్‌, కోడలు బిందు ఉన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు చనిపోయారు. బెంగ‌ళూరులో జ‌రిగిన ఈ ప్ర‌మాదంతో త‌మిళ‌నాట విషాదం నెల‌కొంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu