మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్ఏ అందాల పోటీలో గుడివాడ మహిళకు రెండో స్థానం

కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక  మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్ఏ అందాల పోటీల్లో ద్వితీయ స్థానం కైవశం చేసుకున్నారు. ఉద్యోగం వీడి భర్తతో అమెరికాకు వెళ్లినా తన ప్రతిభతో ఇంకా రాణి స్తూనే ఉన్నారు. ఇందుకు గత నెల 26వ తేదీన అమెరికాల్లోని మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్ఏ అందాల  పోటీల్లో ద్వితీయ స్థానం కైవశం చేసుకోవడమే ఉదాహరణ.

 గుడివాడకు చెందిన అట్లూరి కృష్ణప్రసాద్, శైలజ దంపంతుల కుమార్తె  మౌనిక బెంగళూరులో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 2013లో ఏపీపీఎస్సీలో ఉద్యోగం సంపాదించి వరంగల్ లో ఇరిగేషన్ ఏఈగా విధులు నిర్వహించారు.  అనంతరం ఆపరేషన్ భగీరథలో ఇంజినీర్ గా పనిచేసిన ఆమెకు చెన్నైకు చెందిన పరు చూరి జితేంద్ర కుమార్ 2014లో వివాహం అయ్యింది. వివాహానంతరం ఉద్యోగం మానేసిన మౌనిక భర్తతో  కలిసి 2017లో అమెరికా వెళ్లారు.  అక్కడ సేల్స్ ఫోర్సు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆత్మవిశ్వాసం, సేవా లక్షణాలు మెండుగా ఉన్న మౌనిక మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్ఏ అందాల పోటీల్లో పాల్గొని వేల మందిని దాటుకుని 25 మంది తుది జాబితాలో స్థానం సంపాదిం చుకున్నారు.  మే 26న డల్లాస్ లో ఇర్వింగ్ ఆర్ట్ సెంటర్లో   జరిగిన ఫైనల్స్ లో రెండో స్థానం దక్కించు కున్నారు.  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu