కమల్ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం

 

 

కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కమల్ హాసన్ తన సినిమా థగ్ లైఫ్ జూన్ 05 న కర్ణాటకలో విడుదల కావడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి ఏ ఆధారాలతో కన్నడ తమిళ భాష నుండి పుట్టిందని వ్యాఖ్యలు చేశారని, ఒక్క క్షమాపణ చెబితే విషయం సద్దుమణుగుతుందని కర్ణాటక హైకోర్టు పేర్కొన్నాది. 

మీరేమైనా చరిత్రకారుడా ? ఏ ఆధారాలతో అలాంటి వ్యాఖ్యలు చేశారు ? అంటూ కమల్ హాసన్‌ను కోర్టు  ప్రశ్నించింది. దీంతో కమల్ హాసన్‌పై కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తమ రాష్ట్ర భాషను అవమానించినందుకు కమల్ హాసన్ వెంటనే క్షమాపణలు చేప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ సినిమా విడుదలను నిషేధించాలని ప్రకటించింది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని కన్నడిగులు డిమాండ్ చేశారు, కానీ అతను తాను తప్పు మాట్లాడలేదని, క్షమాపణ అవసరం లేదని స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu