కాణిపాకం దేవస్థానంలో అన్నప్రసాద భవనం ప్రారంభించిన మంత్రి ఆనం
posted on Aug 27, 2025 2:01PM

కాణిపాకం దేవస్థానంలో వినాయక చవితి పర్వదినం రోజున నూతన అన్న ప్రసాద భవనాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడడి ప్రారంభించారు పూతలపట్టు ఎమ్మెల్యే కిలికిరి మురళీమోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నూతన అన్న ప్రసాద భవనం ప్రారంభించిన అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వంటశాలను పరిశీలించారు. అనంతరం అన్నవితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.
కాగా కాణిపాకంలో వినాయక చవితి ఉత్సవాలు వేభవంగా జరిగాయి. వినాయకచవితా రోజున కాణిపాకంలో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా వినాయకుడి విగ్రహాన్ని ఊరేగిస్తారు. వినాయక చవితి మరుసటి రోజు నుంచీ కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాలు ఆరంభమౌతాయి. ఈ ఏడాది వినాయకచవితి బుధవారం (ఆగస్టు 27)న వచ్చింది. దీంతో కాణిపాకం బ్రహ్మోత్సవాలు గురువారం (ఆగస్టు 28) నుంచి ఆరంభమౌతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా వాహన సేవలు, వినాయక కల్యాణోత్సవం, రథోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.