ఇదో ఫైవ్ స్టార్ శ్మశానం కథ...
posted on Sep 3, 2016 12:11PM

ఈ ఫోటోలో ఉన్న భవనం చూస్తే ఏమనిపిస్తోంది. ఇంకేమనిస్తుంది.. ఇదేదో ఫైవ్ స్టార్ హోటల్, లేక కార్పోరేట్ సంస్థలు ఉండే భవనమో అనిపిస్తుంది కదా. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇవేమి కావు.. ఇది అక్షరాల ఓ శ్మశానం.. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం. ఇంతకీ ఆ శశ్మానం ఎక్కడ ఉందనుకుంటున్నారా.. బ్రెజిల్‌లో. బ్రెజిల్‌లోని సాంటోస్‌లో ఈ శ్మశానం ఉంది. దీనిపేరు ‘మెమోరియల్ నెక్రోపోల్ ఎక్యుమెనికా’.1986లో ఈ శ్మశానాన్ని నిర్మించారు. 108 మీటర్ల అందమైన భవనం.. 35 అంతస్తులతో ఆకాశానికి చేతులు చాచే ఎత్తు.. చుట్టూ అరుదైన చెట్లతో నిండిన ఉద్యానవనాలు.. అందులో ముచ్చటగొలిపే వాటర్ ఫౌంటేన్‌లు.. నెమలి పార్క్.. ఓ జలపాతం.. ఆకలి తీర్చే ఫలహారశాల.. ప్రార్థనలు చేసుకోవటానికి ఓ పెద్ద చర్చి.. సేద తీరడానికి లగ్జరీ రూమ్‌లు ఇవన్నీ శశ్మానంలో ఉంటాయి. ఈ శశ్మానంలో 25,000 మృతదేహాలకు సరిపడా సామర్థ్యం ఉంది. ఇందులో ఉన్న 32 ఫ్లోర్లలో ఒక్కో ఫ్లోర్‌కి దాదాపు 150 సమాధులు,అందులో ఒక్కోదానిలో ఆరు మృతదేహాలు పడతాయి. ఇందులో సమాధి చేసే మృతదేహాలు దాదాపు 3 సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటాయట. అయితే లగ్జరీగా ఉన్న ఈ శశ్మానంలో మృతదేహాన్ని భద్రపరుచుకోవడానికి 5వేల నుంచి 20,000 డాలర్ల వరకూ ఖర్చవుతుందట. మరి ఈ మాత్రం ఫెసిలిటీస్ ఉంటే ఆ మాత్రం చెల్లించాలి కదా. మరి ఇన్ని సదుపాయాలు ఉన్న ఈ శ్మశానం గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించకుండా ఉంటుందా.. అందులో కూడా చోటు దక్కించుకుంది.
.jpg)