పార్టీ నుంచి సందీప్ కుమార్ సస్పెండ్...
posted on Sep 3, 2016 12:31PM
.jpg)
ఆప్ మంత్రి సందీప్ కుమార్ అశ్లీల వీడియోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలు బయటకు వచ్చిన వెంటనే ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆయనను పదవి నుండి తప్పించారు. అయితే ఇవాళ పార్టీ నుంచి కూడా సందీప్ కుమార్ ను సస్పెండ్ చేశారు. సందీప్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు శనివారం ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ విలువల విషయంలో రాజీ పడేది లేదని, తప్పులను సహించడం కన్నా చావడానికైనా తాము సిద్ధంగా ఉంటామని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. మరోవైపు వీడియోలపై విచారణ చేపట్టేందుకు దిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. సందీప్‌తో పాటు ఆ వీడియోలో కన్పించిన ఇద్దరు మహిళలను కూడా పోలీసులు విచారించనున్నారు.
ఇదిలా ఉండగా సందీప్ కుమార్ మాత్రం వీడియోలో ఉంది తాను కాదని..ఆ సీడీ అంతా ఓ కుట్ర అని సందీప్ ఆరోపిస్తున్నారు. మరి ఏది నిజమో.. అబద్దమో తెలియాలంటే దర్యాప్తు జరిగేంత వరకూ ఆగాల్సిందే.