మేకపాటి,కోమటిరెడ్డి కాంగ్రెసు నోటీసులు
posted on Dec 29, 2011 8:11AM
న్
యూఢిల్లీ: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాంగ్రెసు పార్టీ అధిష్టానం నోటీసులు జారీ చేసింది. లోక్‌పాల్‌కు ఎన్నికల కమిషన్‌లాగా రాజ్యాంగ బద్ధత కల్పించాలన్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రతిపాదనకు లోక్ సభలో ఓటింగ్ జరుగుతున్న సమయంలో సుమారు ఇరవై ఐదు మంది ఎంపీలు గైర్హాజరైన విషయం తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధిష్టానం ఎంపీలందరికీ నోటీసులు జారీ చేసింది.అందులో మన రాష్ట్రానికి చెందిన మేకపాటి, కోమటిరెడ్డి ఉన్నారు. తన గైర్హాజరీపై కోమటిరెడ్డి ఇప్పటికే పవర్ కుమార్ బన్సాల్‌కు వివరణ ఇచ్చుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను హాజరుకాలేదని ఆయన చెప్పారు. ఇటీవల వారి కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మేకపాటి తాను రాజీనామా చేశాక విప్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నిస్తున్నారు.