నేడు మంచు మనోజ్‌కి సంకెళ్లు

ఈ రోజు మంచు మనోజ్ కి సంకెళ్లు పడనున్నాయి. అంటే... ప్రముఖ సినీ నటుడు, నిర్మాత డా. మోహన్‌బాబు చిన్న కుమారుడు, యువ నటుడు మంచు మనోజ్, ప్రణతిరెడ్డిల నిశ్చితార్ధం నేడు జరగనుంది. బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఈ నిశ్చితార్ధ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మోహన్‌బాబు పలువురు ప్రముఖ రాజకీయ మరియు సినీ తారలను ఆహ్వనించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుండే కాదు కోలీవుడ్, బాలీవుడ్ నుండి రజనీకాంత్, అమితాబచ్చన్ కూడా హాజరుకానున్నారు. తమ కుటుంబంలోకి రాబోయే ప్రణతిరెడ్డి తమకు మూడో కూతురు లాంటిదేనని మోహన్‌బాబు, నా దేవత అని మంచు మనోజ్ చేసిన ట్వీట్ ల బట్టి చూస్తే ప్రణతి రెడ్డి మోహన్‌బాబు కుటుంబంలో బాగానే కలిసిపోయిందని తెలుస్తోంది.