రెచ్చిపోయిన ఉగ్రవాదులు... ఇంగ్లండ్ పై ఆత్మహుతి దాడి.
posted on May 23, 2017 10:39AM

ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. తరచూ ఎక్కడో ఒకచోట దాడులు జరిపే ఉగ్రవాదులు..ఈసారి ఇంగ్లాండ్ పై తమ పంజా విసిరారు. వివరాల ప్రకారం... ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ ఎరీనాలో అరియాణా గ్రాండే సంగీత కచేరి జరుగుతుంది. ఈ కచేరికి గాను భారీ ఎత్తున జనం అక్కడ గుమిగూడారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు అక్కడ ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 20 మంది మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇతరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కాగా ఈ దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఉగ్రవాదులు చేసిన ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దీనిని ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యానని మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.