మహా సీఎం రాజీనామా..

తెలుగువన్ చెప్పినట్లే జరిగింది.  మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష అనివార్యమైతే.. అంతకు ముందే సీఎం ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేస్తారని తెలుగువన్ ముందే ఊహించింది. చివరికి అదే జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు. అసెంబ్లీలో గురువారం (జూన్ 30) బలపరీక్ష జరగాల్సి ఉండగా దానికి ఆపాలంటూ ఆయన సుప్రీం ను ఆశ్రయించారు.

అయితే  మహా సంక్షోభంపై సుప్రీం కోర్టు బుధవారం సాయంత్రం బలపరీక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. సుప్రీం ఆదేశాలు జారీ చేసిన స్వల్ప వ్యవధిలోనే ఉద్ధవ్ థాక్రే రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు తన రాజీనామా లేఖ అందజేశారు. బల పరీక్షపై స్టే విధించడం కుదరదన్న సుప్రీం తీర్పును గౌరవిస్తున్నానని ఉద్ధవ్ అన్నారు.

మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగేందుకు సహకరించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఈ సందర్భంగా ఉద్ధవ్ థాక్రే కృతజ్ణతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శివసనే సర్కార్ కు కొందరి ద్రిష్టి తగిలిందనీ, అది ఎవరిదో అందరికీ తెలుసుననీ పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు  మహా వికాస్ అఘాడి ప్రభుత్వం బాలాసాహెబ్​ ఆశయాలు నెరవేర్చిందన్నారు.

సీఎం పదవితో పాటు ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. రాజీనామాకు ముందు ఉద్దవ్‌ ఠాక్రే అధ్యక్షతన మహారాష్ట్ర కేబినెట్‌ భేటీ అయింది.   కేబినెట్‌ భేటీలో మంత్రులకు సీఎం ఉద్దవ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఏమైనా తప్పు జరిగితే అందరూ తనను మన్నించాలని ఠాక్రే కోరారు. తన వాళ్లే తనను మోసం చేశారని, వెన్నుపోటు పొడిచి ఈ స్థితికి తీసుకొచ్చారని ఉద్వేగానికి లోనయ్యారు.

సుప్రీం తీర్పుకు ముందే తెలుగువన్ ఉద్ధవ్ రాజీనామా గురించి చెప్పింది.  

https://www.teluguone.com/news/content/thakrey-to-resign-if-cant-avoid-floor-test-25-138717.html