కోవిడ్ కేసుల పెరుగుదలతో భయం పట్టు కుందా?

కోవిడ్ కేసులు పెర్గుతూ ఉండడంతో ఆసుపత్రులకు భయం పట్టుకుంది. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ ప్యాన్డమిక్ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. కోవిడ్ రోగుల శాతం గణనీయంగా పెర్గుతూ ఉండడం తో శరీరంలో ఒళ్ళు నెప్పులు, జ్వరం,లంగ్ ఫైబ్రోసిస్,పల్మనరీ ఎంబాలిజం,బ్రెయిన్ ఫాగింగ్ వంటిసమస్యలతో అవుట్ పేషెంట్ రోగులుగా వస్తున్నారని డాక్టర్స్ తెలిపారు. చాలామందిలో మానసిక సంబందమైన సమస్యలు యాంక్జైటీ,ఒత్తిడి,కంఫ్యుషన్. హై బిపి,జ్ఞాపక శక్తినికోల్పోడం,కొత్తగా డయాబెటిస్,వంటి సమస్యలతో రోగులు వస్తున్నట్లు తెలిపారు.మూడునెలల కాలంలో 99౦ రోగులలో 31.8%రోగులు పోస్ట్ కోవిడ్ రోగులు కావడం విశేషం.11% మందిలో కోవిడ్ లక్షణాలు ఇంకా ఉన్నాయని,9-నుండి12 నెలలలో అలసట 12.5%మైలోరియా 9.3%ఊపిరి పీల్చుకోడం కష్టంగా ఉన్న రోగులు ఉన్నారు.డిల్లి లోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సాకేత్ తెలిపారు. కోవిడ్ లక్షనాలు లేని వారు కూడా దీర్ఘకాలిక కోవిడ్ సమస్యలు గుర్తించామని.మాక్స్ సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రికి డైరెక్టర్ డాక్టర్ వివేక్ నంజియా అన్నారు.

వీరు ఎక్కువగా కళ్ళు, ఇతర అవయవాలపై ప్రభావం ఉందని తేల్చారు.చాలా కేసులను పరిశీలించిన మీదట వైరస్ దీర్ఘకాలంగా కొనసాగే అవకాసం ఉందని. వైరస్ నుండి బయట పడ్డ తరువాత కూడా సమస్యలు వస్తున్నాయని పూనా జూపిటర్ ఆసుపత్రికి చెందిన మహేంద్ర డడ్కే అన్నారు.పోస్ట్ కోవిడ్ లో న్యూరో వైడైటరీ లక్షణాలు డిప్రెషన్,ఒత్తిడి,యాంక్జైటీ,బ్రెయిన్ ఫాగ్,నిద్రలేమీ. ఊపిరి పీల్చుకోలేక పోవడం వంటి సమస్యలతో వస్తున్నారనిముఖ్యంగా వారు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తరువాత వచ్చిన సమస్యలుగా పేర్కొన్నారు.ఏది ఏమైనా ఇతర అవయవాల ను నాశనం చేయలేదని ఐ సి యు లో ఉన్నవారు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నవారే నని తేల్చారు. ఒక్కోసారి కోవిడ్ నెగెటివ్ వచ్చిన ఐ సి యు లో ఉండేవారని నిమోనియా తదితర సమస్యలు వారిని వేదిస్తున్నట్లు గుర్తించామన్నారు.