ఫ్లు వస్తే ఏం చేయాలి ఎలాంటి మందులు వాడాలి...

అసలు  ఫ్లు వస్తే ఎలా ఉంటుంది ఎలాంటి బాధ పడతారు అన్న విషయాలు తెలుసుకుందాం.
జరీ కింద పది నలిగి పోయినట్టు గా బాధ పడుతున్నారా?జ్వరం వచ్చి ఇక చచ్చిపోతనేమో అన్నంత గా భయ పడిపోతున్నారా?ఇప్పుడు పడుతున్న బాధకంటే చచ్చిపోయినా బాగుండు నని అనుకుంటున్నారా? తల పోటుగా ఉండడం కండరాలు గుంజుతున్నట్టుగా ఉందా?నుదురు మంటల్లో కాలిపోతున్నట్టుగా ఉంటుందా? అయితే అది ఫ్లు వైరస్ అని మీరు గ్రహించాలి.తగ్గి పోయే అంతవరకూ అది మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటుంది. అమెరికాలో సంవత్సరానికి 1౦3మిలియన్ల ప్రజలు ఫ్లు బారిన పడుతూ ఉంటారు.72 వేల మంది రోగులు ఉండడం ఆసుపత్రిలో చేరుతూ  ఉండడం గమనించవచ్చు అలాగే అమెరికాలో ఫ్లు,నిమోనియా తో 69,౦౦౦ మంది  మరనిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఫ్లూ చాలా నెమ్మదిగా అమ్మయకంగా వస్త్ఝుంది.ఒళ్ళంతా కొద్దిపాటి నొప్పులు ప్రారంభమై,కొద్దిగా తల నొప్పి,గొంతునొప్పి  వస్తుంది.కొన్ని గంటల తరువాత చలి ప్రారంభమై జ్వరం,దగ్గు,శరీరం లాగుతున్నట్లు అంటే గుంజినట్లుగా,కీళ్ళ నొప్పులు  వచ్చి మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే అది ఫ్లూ అని చెప్పవచ్చు.. అసలు ఫ్లూ ని ఎలా చూడాలి ఫ్లూ ని వెయ్యి తలలు ఉన్న  రాక్షసిగా చూడాలని అంటున్నారు వైద్యులు. ఇంఫ్లూయేన్  జా లో మూడు రకాల వైరస్లు ఉన్నా ప్రధమికం గా ఎ,బి,సి అనే మూడు రకాలే ఉన్న అవి ఒకదానికి ఒకటి కలగలిపి అనేక రూపాల కింద రూపాంతరం చెందుతుంది.అలాగని ఈఏడు  వైరస్ ల కంటూ టీకా తీసుకున్నప్పటికీ ఫ్లూ వచ్చి  మీమీద దాడి చేసే మిమ్మల్ని మీ శరీరాన్ని బలహీనం చేసే అవకాసం ఉంది.

ఫ్లూ వచ్చినప్పుడు యాంటీ బాయిటిక్స్ తీసుకున్న లాభంలేదు.వైరస్ మూలంగా వచ్చే ఫ్లూ యాన్టి బాయిటిక్స్ పనిచేయవు. ఫ్లూ కు మీరు వేరే మందులు వాడాల్సిందే.

ఫ్లూ వచ్చినప్పుడు ఎలాంటి జగత్తలు తీసుకోవాలి...

ఫ్లూ వచ్చి నప్పుడు ఇంట్లో ఉండండి.ఫ్లూ ఒకళ్ళ నుండి మరొకరికి వ్యాపించే అంటువ్యాధి.ఫ్లూ వచ్చినప్పుడు ఆఫీసుకి వెళ్లి పనిచేసే ప్రయత్నం చేయకండి.మీవల్ల మిగతా వాళ్ళకు సోకే ప్రమాదం ఉంది.  ఫ్లూ తగ్గే దాకా ఇంట్లోనే ఉండండి.జ్వర, సాధారణ స్థితికి వచ్చేదాకా కొన్ని రోజులు ఆగండి.ఒక వేళ మీపిల్లలకు ఫ్లూ వస్తే  ఫ్లూ పూర్తిగా తగ్గే దాకా వాళ్ళను స్చూలుకు పంపకండి.

ఫ్లూ వచ్చిన వాళ్ళు విశ్రాంతి తీసుకోండి...

ఫ్లో వచ్చిన వ్వల్లలో పూర్తిగా జ్వరం అలసట నీరసం ఉంటుంది కాబట్టి.మంచం మీదే రెస్ట్ తీసుకోండి.శరీరానికి రెస్ట్ ఇవ్వడం వల్ల మీ శరీరం తన శక్తిని కూడా గట్టుజుని ఫ్లూ ఇన్ఫెక్షన్ పై పోరాడేందుకు వినియోగిస్తుంది మీరు కదులుతూ మీరు ఎదో ఒక వ్యాపకం లోకి వెళ్ళారంటే మీరు పూర్తిగా నీరసించిపోయి ఉండడం వల్ల  మీశరీరంలో  డిఫెన్స్ మెకానిజం బలహీనపడి తీవ్ర సమస్యలకు దారి 
తీయవచ్చు.

ఆహారం లో ఏమితీసుకోవాలి...

ఫ్లూ జ్వరం తో బాధ పడేవారు డీ హైడ్రేషన్ కు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంత ఎక్కువగా ద్రవ ఆహారాన్ని తీసుకోవాలి.మీరు ఘన ఆహారాని తీసుకున్న సహించదు.ద్రవ ఆహారం మీకు పోషక శక్తిని ఇస్తుంది. ఆహారంలో పల్చటి సూపులు,పళ్ళు,వెజిటేబుల్ రసాలు,అంటే ముఖ్యంగా బీట్రూట్,క్యారెట్ రసాలు,విటమిన్లు,ఖనిజ లవణాలు ఉండే ద్రవాలు తీసుకోవాలి. సగం జ్యుస్ కి అంతే నీళ్ళు కలిపి రుచికోసం కొంచం పంచదార కలుపుకోవచ్చు.పంచదారను ఎక్కువగా కలిపితే జ్వరంలో అది విరేచనాలకు దారి తీస్తుందిపంచదారను కొంచం గా మాత్రమే తీసుకోవాలి.

శరీరం పూర్తిగా బలహీన పడి ఒళ్ళు నొప్పులు తగ్గాలంటే...

ఆస్ప్రిన్,నైస్,ఇబుప్రోఫెన్,లాంటి మందులుఫ్లూ తో పాటు వచ్చే మందులు తలనొప్పి,ఒల్లునోప్పులను తగ్గిస్తాయి.అది డాక్టర్ సూచన మేరకే వాడాలి. ఫ్లూ లక్షణాలు మధ్యాహ్నం,సాయంత్రము,ఎక్కువగా కనిపిస్తాయి.అందుకు డాక్టర్లు ఈ మందులను నాలుగు ఘంటలకి  ఒకసారి వేయమని చెబుతారు.సొంత వైద్యం చేసుకోడం అనర్ధం. గమనిక అస్ప్రిన్ మందును పిల్లలకు ఇవ్వకూడదు.దీ ని వల్ల నరాల సంబందిత వ్యాధితో బాధ పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

 ఇష్టమొచ్చిన మందులు వాడవద్దు...

ఫ్లూ తో బాధ పడుతున్నప్పుడు జలుబుకు సంబందించి మనకు తెలిసిన  టాబ్లెట్స్ ను వాడవద్దు.లేక మందుల షాపు లో వాళ్ళు ఇచ్చిన మందులు వాడవద్దు.అలాంటి మందు వల్ల  కొన్ని లక్షణాలు తొలగి పోయి,తాత్కాలికంగా ఫ్లూ తగ్గినట్టు అనిపిస్తుంది.కానీ మళ్ళీ తిరగ బెట్టి సీరియస్ సీరియస్ అయ్యే అవకాసం ఉంది 

ఉప్పు నీటిన్ పుక్కిలించండి...

ఫ్లూ సోకినప్పుడు గొంతు పొడి ఆరి పోయి నట్లు ఉంటుంది.స్పూను ఉప్పునునీళ్ళలో కలిపి గార్లింగ్ చేస్తే కొంత రిలీఫ్ ఉండవచ్చు. అయితే ఆనీటిని మింగకూడదు. ఉప్పు లవణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని మింగాక పోవడమే మంచిది.

వేడి కాపడం పెట్టుకోవాలి...

ఫ్లూ తో వచ్చే ఒళ్ళు నొప్పులకు అలసట అధికంగా ఉంటుంది.ఈ నొప్పులనుంచి కాస్త ఉపసమనం కోసం వేడి కాపడం ఉపయోగ పడుతుంది.

తాజా  గాలి తీసుకో డం ముఖ్యం...

రోగి ఉన్న గదిలోకి తాజా గాలి వచ్చేవిధంగా ఏర్పాట్లు చేసికోవాలి.అయితే చలివేయకుండా వెచ్చటి పక్క బట్టలను అమర్చుకోవాలి.

వెన్ను నిమరడం చేయాలి...

ఫ్లూ తో బాధ పడే వ్యక్తులు ఎవరైనా మృదువుగా మసాజ్ చేయించుకున్నట్లుగా ఎవరితో ఐనా వెన్ను నిమిరించుకుంటే ఆవ్యక్తిలో రోగ నిరోధక యంత్రాంగం యాక్టివ్ అయ్యి ఫ్లూతో పోరాడేందుకు తయారు అవుతుంది.

తేలిక పాటి ఆహారం తీసుకోవాలి...

ఫ్లూ రోగులకు ఆకలి ఉండదు కాని ఫ్లూ తగ్గు ముఖం పడుతూ ద్రవ ఆహారం నుంచి ఘన ఆహారం తీసుకుంటునప్పుడు పేషంట్ తీసుకునే ఆహారం చాలా తేలికగా జీర్ణ మయ్యేడిగా ఉండాలి.బ్రెడ్ పాలు మెత్తటి వరిడాక్టర్ సూచించిన విధంగా తీసుకోవాలి.