లోకేష్ ప్రజాదర్బార్‌కి విశేష స్పందన!

వైసీపీ ప్రభుత్వం అధికారంలో వున్నంతకాలం ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు తమ సమస్యలను ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం లభిస్తోంది. ఏపీ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో మంగళవారం నాడు నిర్వహించిన ప్రజా దర్బార్‌ సందర్భంగా ప్రజలు నేరుగా లోకేష్‌ని కలిశారు. వారి సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఆయా సమస్యలు పరిష్కరిచేందుకు కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. బాధితులకు తమకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు. ప్రజాదర్బార్ సందర్భంగా లోకేష్ దగ్గరకి వైసీపీ నాయకులు చేసిన దుర్మార్గాల బాధితులు భారీ సంఖ్యలో వస్తున్నారు. వారి సమస్యలను ఓపిగ్గా వింటున్న లోకేష్, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. అలాగే ప్రజల నుంచి తనకు అందుతున్న వినతిపత్రాలను సంబంధిత మంత్రులు, అధికారులకు అందిస్తూ, ఆయా సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారాలు చూపించాలని లోకేష్ ఆదేశిస్తున్నారు.

సాధారణంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టినప్పుడు ఆ వినతి పత్రాలు సంబంధిత శాఖల మంత్రులకు, అధికారులకు ఎప్పుడు చేరుతాయో అర్థంకాని పరిస్థితి. అయితే నారా లోకేష్ నిర్వహిస్తన్న ప్రజాదర్బార్ మాత్రం అందుకు భిన్నంగా, లోకేష్ మార్కుతో కొనసాగుతోంది. ప్రజల నుంచి తనకు అందిన వినతిపత్రాలను లోకేష్ వెంటనే సంబంధిత శాఖ మంత్రులకు అందిస్తున్నారు. తాజాగా ప్రజాదర్బార్ కార్యక్రమం జరిగినప్పుడు లోకేష్ ఈ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu