లిక్కర్ కేసు నిందితుల నివాసాల్లో సోదాలు

 

ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఏపీ సిట్ అధికారులు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆఫీస్, భారతి సిమెంట్స్ కార్యాలయం, నానక్‌రామ్ గూడలోని చాణక్యకు చెందిన టీగ్రిల్ రెస్టారెంట్‌లో తనిఖీలు చేశారు.  మద్యం కుంభ కోణ నిందితులు ఎక్కడ సమావేశమయ్యారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే స్కామ్‌కు ముందు వీరు ఎన్ని సార్లు భేటీ అయ్యారనే అంశంపై సిట్ దర్యాప్తు చేస్తోంది. 

పలు సాంకేతిక ఆధారాలతో ఈ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. పలు రికార్డులను కూడా పరిశీలించారు. తదుపరి చర్యలపై ఉత్కంఠ రేగుతోంది. ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారుల వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సైతం జైలుకు పంపారు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు.. ఇప్పటికే పలువురు నిందితులను సైతం అరెస్ట్ చేశారు. తాజాగా మరికొందరి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు చేసిన ఈ రైట్స్ ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుంది

Online Jyotish
Tone Academy
KidsOne Telugu