తిరుపతిలో చిరుత కలకలం!

తిరుపతిలో చిరుత సంచారం కలకలం రేపింది. ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. అలిపిరి జూపార్క్ రోడుపై  బుధవారం (జులై 16)చిరుత పులి కనిపించింది. అలిపిరి జూపార్క్ రోడ్డుపై  అరవింద ఐ ఆసుపత్రి సమీపంలో డివైడర్ పక్కన సేద తీరుతున్న చిరుతపులిని చూసిన యువకులు వీడియో తీసి సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. వెంటనే ఈ వీడియో వైరల్ అయ్యింది.

తిరపతి ప్రజలు చిరుత సంచారంపై తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా  ఎస్వీ యూనివర్సిటీ, జూపార్క్ రోడులలో చిరుత కదలికలు ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు.  చిరుతను బంధించేందుకు ఎస్వీ వర్సిటీ ప్రాంగణంలో బోను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు జూపార్క్ రోడ్డులో చిరుత కనిపించడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu