ఏపీలో లెక్చరర్ పోస్టుల పరీక్షలు వాయిదా

 

ఏపీలో లెక్చరర్ పోస్టుల పరీక్షలను వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఏపీలో పలు లెక్చరర్ పోస్టుల పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, టీటీడీ కళాశాలలు కోసం జూన్ 16 నుండి 26 మధ్య జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయని పేర్కొంది. అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొంది. 

కొత్త తేదీలను కమిషన్ ఇంకా ప్రకటించలేదు. నోటిఫికేషన్‌లు 13/2023, 16/2023, 17/2023 కింద 99 పాలిటెక్నిక్, 47 జూనియర్, 290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, టీటీడీ పోస్టులు భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. తాజాగా అవన్నీ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను (https://psc.ap.gov.in) పర్యవేక్షిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu