విరిగిపడ్డ కొండచరియలు...ఒకరు మృతి ముగ్గురు గల్లంతు
posted on Sep 9, 2024 11:51AM
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. అల్లూరి జిల్లాలో కొండచరియలు విరిగి ఒకరు మృత్యువాతపడ్డారు. శిథిలాల చిక్కుక్కున్న నలుగురిని కాపాడిన అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు.
అలాగే చత్తీస్ ఘడ్ తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులను అంతరాష్ట్ర సరిహద్దు అయిన నర్సీపట్నం, భధ్రాచలం రహదారిపై కొండచరియలు విరిగిపడుతూనే ఉన్నాయి. ఏకంగా 20 కిలో మీటర్ల వరకు కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.